తిమ్మరాజుపల్లి టీవీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు: కిరణ్ అబ్బవరం

తిమ్మరాజుపల్లి టీవీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు: కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌‌‌‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’.  సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు.  వి.మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘నా సినిమాలకు ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌ ఎడిటింగ్ చేసే మునిరాజును ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నా. 

నైంటీస్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఓ విలేజ్‌‌‌‌లో జరిగే సస్పెన్స్ డ్రామా ఇది. అప్పుడు తను చూసిన మనుషుల ఇన్నోసెన్స్‌‌‌‌, వాళ్ల మధ్య జరిగే డ్రామా, అప్పట్లో టీవీకి ఉండే ప్రాధాన్యతను చూపిస్తూ హానెస్ట్‌‌‌‌గా ఈ సినిమా తీశాడు. నా సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసిన సాయి తేజ్‌‌‌‌ ఇందులో హీరోగా నటించాడు.  ఇందులోని పాత్రలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

నైంటీస్ కిడ్స్‌‌‌‌కు తమ గతమంతా గుర్తొస్తుంది. సినిమా చూస్తూ వీళ్లలా నేను నటించగలనా అనిపించింది.  అంతలా మెస్మరైజ్ చేశారు. మా సంస్థలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాం. అందులోనూ నటీనటులుగా కొత్త వాళ్లకే అవకాశం ఇస్తున్నా’ అని చెప్పాడు.   డైరెక్టర్ వి.మునిరాజు,  హీరోహీరోయిన్స్‌‌‌‌ సాయి తేజ్, వేద జలంధర్, నటీనటులు తేజ విహాన్, రాధశ్రీ, స్వాతి కరిమిరెడ్డి, లతీష్, ప్రదీప్ కొట్టె,  మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన, డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి,  క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్, గీత రచయిత సనరే పాల్గొన్నారు.