RRR తో తెలంగాణ ముఖచిత్రం మారుతది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

RRR తో తెలంగాణ ముఖచిత్రం మారుతది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో తెలంగాణ ముఖచిత్రమే మారుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆర్ అండ్ బీ పై సమీక్షించినమంత్రి.. కీలక విషయాలుప్రస్తావించారు. ఓఆర్ఆర్ నిర్మాణంతో నగరాన్ని ఇన్వెస్ట్ మెంట్ హబ్ గా మార్చామన్నారు. రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని.. వర్షాలు పెరగకముందే రోడ్లు బాగు చేస్తామని చెప్పారు. హైదరాబాద్- విజయవాడ రోడ్డులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, హైవేలో రోడ్ సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి వెంకట్ రెడ్డి. 

డిసెంబరులోపే హైదరాబాద్‌- విజయవాడ  నేషనల్ హైవే (NH -65) విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు . హైదరాబాద్ ను ఇన్వెస్ట్ మెంట్ హబ్ గా మార్చామన్నారు. 

ట్రిపుల్  ఆర్ కు  గత ప్రభుత్వం యుటిలిటీ ఛార్జీలు కూడా కట్టలేదన్నారు. గత సర్కార్ అవగాహన లేకుండా ఆర్ఆర్ఆర్ పై నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ట్రిపుట్ ఆర్ కు పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.  ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామనిచెప్పారు. హైవేలో రోడ్ సేఫ్టీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ రోడ్ల మధ్య రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వర్షాకాలం రాకముందే రోడ్లను రెడీ చేయాలని ఆదేశించారు.