మమ్ములను భయపెట్టిస్తం అంటే ఊరుకుంటామా

మమ్ములను భయపెట్టిస్తం అంటే ఊరుకుంటామా

కోమటిరెడ్డి బ్రదర్స్ కు వేరే శత్రువులు లేరు.. వాళ్లకు వాళ్లే శత్రువులని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బిజీగా ఉండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని మర్చిపోయారన్నారు. కోమటి రెడ్డి ఆదివారం చేసిన కామెంట్స్ పై జగదీష్ రెడ్డి స్పందించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. సొంతపార్టీ నాయకులను భయపెట్టినట్లు మమ్ములను భయపెట్టిస్తాం అంటే ఊరుకుంటామా అన్నారు.  రాజీనామా వ్యవహారం రాకముందే  గట్టుప్పల్ వెళ్లి మండలం అయితుందని చెప్పానని పేర్కొన్నారు. 25 కోట్లకు పదవి కొన్నడు అని ఆరోపించి..మళ్ళీ ఆయన పక్కనే డయాస్ పంచుకుంటారు. నేను ఎప్పుడూ అన్నదమ్ముల గురించి మాట్లాడలేదు..నన్ను టార్గెట్ చేసి మాట్లాడినా నేను వాళ్ళను ఏమీ అనలేదన్నారు.

రాజగోపాల్ రెడ్డి ఎంపీ అయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. ఇవ్వాళ్టికి కూడా కాంగ్రెస్ సభ్యత్వం ఉందో లేదో డౌటేనని జగదీశ్ రెడ్డి  వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి ఏ పదవి చేసినా ఒక్కసారికే పరిమితం... రెండోసారి ప్రజలు నమ్మరన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు టీఆరెస్ గెలుస్తుంది.. ఎలాంటి డౌట్ లేదని తెలిపారు. నకిరేకల్ లో ఎలాంటి సమస్య లేదని.. నల్గొండలో ఉన్నదంతా పార్టీ బలమే... లీడర్లు పోతే ఇబ్బంది కాదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆరెస్ ట్రెండ్ నడుస్తోందని..ఓటు షేర్ వల్ల టీఆరెస్ కు నష్టం లేదని చెప్పారు.  ఎన్నికల ఫలితాలు చివరి రెండు మూడు రోజులు, రెండు మూడు గంటలు కూడా నిర్ణయిస్తాయన్న జగదీశ్ రెడ్డి.. యూత్ టీఆరెస్ కు దూరం కావడం కాదు..సమాజానికే దూరం అయ్యారు, ఇంటికే దూరం అయ్యారన్నారు.