కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త్వరలో బీజేపీలోకి చేరతారనే అనుమానం!

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త్వరలో బీజేపీలోకి చేరతారనే అనుమానం!

కోమటిరెడ్డి బ్రదర్స్ పై మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు కల్పించిందన్నారు. అన్నదమ్ములిద్దరూ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారన్నారు. చండూరు సభకు ఎందుకు హాజరుకాలేదో..అమిత్ షాతో ఎందుకు భేటీ అయ్యారో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ అందరిని గౌరవిస్తుందని..సీనియర్ అని చెప్పుకునే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీనియర్లు, జూనియర్లు అనేభావం ఉండకూడదన్నారు. అందరినీ కలుపుకుని వెళ్ల గుణం ఉండాలన్నారు. 

కోమటి రెడ్డి బ్రదర్స్ పొద్దున ఒక మాట రాత్రికి ఒక మాట మాట్లాడుతున్నారని..ఇది సరైన పద్ధతి కాదని దామోదర్ రెడ్డి అన్నారు. ఏపీలో  కేఏ పాల్,తెలంగాణలో ఒక  రాజ్ గోపాల్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే అన్నారు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదన్నారు. అమిత్ షాను ఇద్దరు ఒకేసారి కలిశారు కాబట్టి త్వరలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలోకి జాయిన్ అవుతారనే అనుమానం కలుగుతోందన్నారు.