Kothapallilo Okappudu: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఏం జరిగింది?.. హీరో మనోజ్ చంద్ర సినీ ముచ్చట్లు

Kothapallilo Okappudu: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఏం జరిగింది?.. హీరో మనోజ్ చంద్ర సినీ ముచ్చట్లు

మనోజ్ చంద్ర, మోనికా లీడ్ రోల్స్‌‌లో ‘కేరాఫ్​ కంచరపాలెం’ఫేమ్ ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈనెల 18న సినిమా రిలీజ్ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర మాట్లాడుతూ ‘గతంలో కొన్ని షార్ట్‌‌ ఫిల్మ్స్‌‌ చేశా. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లినా సినిమాపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు చేశా.

‘క్రిస్మస్‌‌ ఇన్‌‌ మియామి’అనే నైజీరియన్ చిత్రంతో పాటు ‘మెన్‌‌ ఇన్‌‌ బ్లూ’అనే షార్ట్ ఫిల్మ్‌‌తో నటుడిగా మంచి గుర్తింపు లభించింది. అప్పటికే ప్రవీణ గారితో ఉన్న పరిచయంతో  రామకృష్ణ పాత్రకు  ఆడిషన్స్ చేసి నన్ను ఎంపిక చేశారు. ఇదొక ఊరి కథ. అప్పన్న అనే వడ్డీ వ్యాపారికి గ్రామస్థులకు మధ్య మీడియేటర్‌‌‌‌గా వ్యవహరించే పాత్ర నాది. సావిత్రి అనే అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఒకరోజు ఆమెను కలవడానికి వెళ్తే ఏం జరిగిందనేది కథ.

వెరీ చాలెంజింగ్ క్యారెక్టర్‌‌‌‌. నాలాంటి ఓ కొత్త నటుడికి ఆ పాత్ర ఇవ్వడం నాపై బాధ్యతను పెంచింది. ఓ దర్శకురాలిగా, నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రవీణ ఈ సినిమా తీశారు . రానా గారు ప్రజెంట్ చేయడం ఫుల్‌‌ హ్యాపీ. ప్రివ్యూస్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది’అని చెప్పాడు.