కేపీ చౌదరి డ్రగ్స్ కేసు : ఆ న‌లుగురు హీరోయిన్లు ఎవరు?

కేపీ చౌదరి డ్రగ్స్ కేసు : ఆ న‌లుగురు హీరోయిన్లు ఎవరు?

టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో పోలీసులు తీగలాగితే డొంక కదులతోంది. కేపీ చౌదరి కాల్ లిస్టు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..కీలక విషయాలను గుర్తించినట్లు తెలుస్తోంది.  కేపీ చౌద‌రిని అరెస్ట్ చేసిన తర్వాత...ఆయన వెనుక ఎవ‌రున్నారు.. ఎన్నాళ్ల నుంచి డ్రగ్స్ సరఫరా సాగుతోంది. టాలీవుడ్లో ఎవ‌రెవ‌రితో సంబంధాలున్నాయి.. అనే కోణాల్లో విచార‌ణ సాగుతోంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన న‌లుగురు హీరోయిన్స్‌.. ఇద్దరు నిర్మాత‌ల‌కు కేపీ చౌదరితో సంబంధాలున్నట్లు సమాచారం. వారితో పాటు కేపీ చౌదరి కాల్ లిస్టులో ఉన్న వారిలో మ‌రికొంద‌రిని పోలీసులు విచారించ‌నున్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ వాడిన వారి వివరాలతో ప్రస్తుతం దొరికిన వారి వివరాలను  సరిపోలుస్తున్నారు. 

 రూట్ మార్చిన డ్రగ్ మాఫియా..

నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో నైజీరియన్ డ్రగ్స్ ముఠా అప్రమత్తమైంది. తెలంగాణ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారని గుర్తించిన నైజీరియన్ ముఠా..కొద్దిరోజుల పాటు హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నైజీరియన్లు వారి దేశంలో ఉంటూనే తెలుగు రాష్ట్రాల్లోని  యువకులు, విద్యార్థులను టార్గెట్గా చేసుకొని ఈ ముఠా  డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలు గోవాలో మహిళల వద్ద కొంత మొత్తంలో డ్రగ్స్ ఉంచి పోలీసులకు చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.