
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన తర్వాత తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో అనుభవం కలిగిన టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఆసీస్ బౌలర్లకు తలవంచింది. కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ ఓటమి సంగతి పక్కన పెడితే ఒక విషయంలో తీవ్ర చర్చ జరుగుతుంది. అదేంటో కాదు టీమిండియా వికెట్ కీపర్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్. ఐదో స్థానంలో ఎంతో అద్భుతమైన రికార్డ్ ఉన్న రాహుల్ పెర్త్ వేదికగా ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఎంతో అనుభవమున్న రాహుల్.. అక్షర్ పటేల్ కంటే వెనుక బ్యాటింగ్ కు రావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు పంపడంపై టీమిండియా మాజీ బ్యాటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైరయ్యాడు. రాహుల్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలని కోరాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. " మొదట వన్డేకు ముందు నేను రాహుల్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు పంపాలని కోరాను. రాహుల్ ను నాలుగోస్ తాణంలో ఆడింది శ్రేయాస్ అయ్యర్ ను ఐదో స్థానంలో పంపించండి. జట్టు కూర్పు నాకు భయంకరంగా అనిపించింది. అక్షర్ పటేల్‌ను రాహుల్ కంటే ముందుగా ఎందుకు పంపుతారు?. 2019 ప్రపంచ కప్‌లో, రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. నాలుగు, ఐదు స్థానాల్లో అతనికి అద్భుతమైన రికార్డ్ ఉంది. రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్‌ను ప్రమోట్ చేయడం చాలా దారుణం". అని శ్రీకాంత్ అన్నాడు.
►ALSO READ | 2027 ODI World Cup: ఆస్ట్రేలియాపై ఎంపిక కాకున్నా 2027 వన్డే వరల్డ్ కప్‌లో అతడు ఉండాల్సిందే: రవిశాస్త్రి
వన్డేల్లో రాహుల్ కు ఐదో స్థానంలో సూపర్ రికార్డ్ ఉంది.50 ఓవర్ల ఫార్మాట్ లో ఐదో స్థానంలో 50కి పైగా యావరేజ్ ఉంది. అయితే ఏడాది కాలంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ నుండి అతను ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరో స్థానంలో కూడా రాహుల్ అదరగొడుతున్నాడు. ఒత్తిడి సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇటీవలే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 42 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.