హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈనెల 27న సమావేశం జరపనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల 27న జరగాల్సిన సమావేశాన్ని సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు కేఆర్ఎంబీ ప్రకటించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది. వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుందని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.

