
ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా త్వరలో మరో ఆకట్టుకునే 5G ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈసారి, కంపెనీ లావా షార్క్ 2 అనే పేరుతో దీనిని తీసుకువస్తోంది. ఈ ఫోన్ లావా షార్క్ 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఫోన్ లాంచ్ ముందే కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ రెండు కలర్ వేరియంట్‌లలో రాబోతుందని టీజ్ చేసింది. ఫోన్ డిజైన్ కూడా చూపించింది. ఈ ఫోన్ బోల్డ్ N1 ప్రో 5Gకి సేమ్ టు సేమ్ ఉంటుంది.
లావా షార్క్ 2 :
సోషల్ మీడియాలో కంపెనీ కొత్త ఫోన్ గురించి టీజ్ చేసింది అలాగే రెండు కలర్స్ లో వస్తుందని తెలిపింది. అయితే కలర్ అప్షన్స్ పేర్లను చెప్పలేదు. లావా షార్క్ 2 మెరిసే బ్యాక్ డిజైన్‌తో ఉండవచ్చు, పైన ఎడమ వైపు చదరపు కెమెరా, కింద లావా బ్రాండింగ్ ఉండవచ్చు.
►ALSO READ | హెచ్సీఎల్ టెక్కు గుర్తింపు.. వరల్డ్స్ మోస్ట్ సస్టయినబుల్ కంపెనీస్2025 చోటు
స్పెసిఫికేషన్లు: ఈ లావా ఫోన్ కెమెరా మూడు సెన్సార్లు ఇంకా LED ఫ్లాష్‌తో వస్తుంది. డెకోయ్ "50MP AI కెమెరా" అని కూడా రాసి ఉంది. రాబోయే లావా షార్క్ 2లో 50-మెగాపిక్సెల్ తో AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చని కంపెనీ ఇంతకుముందే చెప్పింది. టీజర్ ఇమేజ్లో ఫోన్ ఎడమ వైపున సిమ్ ట్రే స్లాట్ చూపిస్తుంది, పవర్ ఇంకా వాల్యూమ్ బటన్‌లు కుడి వైపున ఉండొచ్చు. పాత టీజర్‌లో స్పీకర్ గ్రిల్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, కింద USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. అయితే ఈ ఫోన్ బడ్జెట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. పాత మోడల్ లాగానే ఫీచర్స్: లావా షార్క్ 2 పాత మోడల్ ఫోన్ లాగానే చాల ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. కానీ పాత మోడల్ 90Hz రిఫ్రెష్ రేట్, 6.75-అంగుళాల HD+ డిస్ ప్లే ఉంది, Unisoc T765 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ కూడా ఉంది.