చదువుల్లో జాతీయ సగటుకన్నా తక్కువ

చదువుల్లో జాతీయ సగటుకన్నా తక్కువ

హైదరాబాద్, వెలుగు: పిల్లల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ తెలుసుకునేందుకు కేంద్రం నిర్వహించిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే(నాస్) రిపోర్టు బుధవారం రిలీజ్ అయ్యింది. 3,5,8,10 తరగతుల స్టూడెంట్ల సామర్థ్యాలపై నాస్ సర్వే చేపట్టింది. నివేదిక ప్రకారం..  నేషనల్ యావరేజితో పోలిస్తే తెలంగాణ  అన్ని క్లాసుల్లోనూ వెనుకబడింది. 12 నవంబర్ 2021 న దేశవ్యాప్తంగా సర్వే జరగగా.. రాష్ట్రం నుంచి 4,781 స్కూళ్లలోని 22,818 మంది టీచర్లు, 1,45,420 స్టూడెంట్లు పాల్గొన్నారు.

మూడో తరగతి స్టూడెంట్ల లాంగ్వేజీ సామర్థ్యంలో నేషనల్ యావరేజీ 62% ఉంటే.. తెలంగాణది 48%గా ఉంది. మ్యాథ్స్​లో నేషనల్ 47 % గా ఉంటే.. స్టేట్ 44శాతం, ఈవీఎస్​లో 57 % నేషనల్ యావరేజీ ఉంటే.. తెలంగాణ 45శాతంగా ఉంది. ఐదో తరగతిలోనూ మన రాష్ట్రం, నేషనల్ యావరేజికి తక్కువగానే ఉంది. 8వ తరగతికి నిర్వహించిన లాంగ్వేజీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లోనూ నేషనల్ యావరేజికి కంటే తెలంగాణ తక్కువ స్థాయిలోనే ఉంది. టెన్త్ క్లాసులో ఇంగ్లిష్ సబ్జెక్టులో మాత్రం నేషనల్ యావరేజి 43% ఉంటే..తెలంగాణ 48శాతంగా ఉంది. మిగతా సబ్జెక్టుల్లో నేషనల్ యావరేజి కంటే తక్కువగా ఉంది.  

 

ఇవి కూడా చదవండి

ప్లంబర్​ శైలజ ఇన్​స్పిరేషనల్​ జర్నీ..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు