
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ స్థానిక అనుబంధ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, అక్టోబర్ 7న తన ఐపీఓను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇది తొమ్మిదో తేదీన ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 6న ప్రారంభమవుతుంది.
పేరెంట్ కంపెనీ 10.18 కోట్లకుపైగా షేర్లను (15 శాతం వాటా) విక్రయించనుంది. వాల్యుయేషన్రూ. 15 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కాబట్టి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాకు నిధులు అందవు. ఈ మొత్తం దక్షిణ కొరియాలోని పేరెంట్ కంపెనీకి చేరుతుంది. ఎల్జీ హోంఅప్లయెన్సెస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులు తయారు చేస్తుంది.