
చండ్రుగొండ, వెలుగు : మండలంలోని మద్దుకూరు ప్రభుత్వ స్కూల్ సమీపంలోని టర్నింగ్ లో బుధవారం ఉదయం 9 గంటల సమయంలో జామాయిల్ కర్రల లోడు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కర్రలు స్కూల్ క్లాస్ రూంలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో స్టూడెంట్స్ ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు హైవే పై ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న తహసీల్దారు సంధ్యారాణి, ఎస్సై శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకునే వారికి సర్దిచెప్పారు. బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.