లక్నోకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో 6 కోట్ల పేసర్ ఔట్

లక్నోకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో 6 కోట్ల పేసర్ ఔట్

ఐపీఎల్ లో లక్నో జట్టు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస విజయాలతో ఆ జట్టు ఫుల్ జోష్ లో ఉన్నా.. గాయాల కారణంగా ఆ జట్టు నుంచి ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. ముఖ్యంగా పేస్ బౌలర్లు వెళ్లిపోవడం ఆ జట్టును కలవవరపెడుతుంది. మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ వ్యక్తిగత కారణాల వలన తప్పుకోగా..తాజాగా శివమ్ మావి గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ 2024 మొత్తానికి దూరమయ్యాడు.           

మావి లక్నో జట్టుతోనే ఉన్నా గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో మావి టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. లక్నో యాజమాన్యం ఇంస్టాగ్రామ్ వేదికగా ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో శివమ్ మావిను లక్నో సూపర్ జయింట్స్ రూ.6.4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ ను నేను చాలా మిస్ అవుతున్నాను. గాయం నుంచి కోలుకున్న తర్వాత లక్నో జట్టు బాగా రాణించాలని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది". అని మావి తెలిపాడు. 

లక్నోకు ముందు మావి కేకేఆర్ జట్టు తరపున ఆడాడు. అక్కడ బౌలింగ్ లో రాణించడంతో అతనికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ  యువ బౌలర్ ను రూ 6 కోట్ల భారీ ధరకు లక్నో దక్కించుకుంది. ఇప్పటివరకు 32 మ్యాచ్ లాడిన మావి 30 వికెట్లు పడగొట్టాడు. మావి లేకపోయినా లక్నో జట్టుకు మయాంక్ యాదవ్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు.