- మృతుడు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వాసి
పద్మారావునగర్, వెలుగు: ఓ వ్యక్తి అప్పుల బాధతో చనిపోవాలనుకున్నాడు.. పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ.. అదే హాస్పిటల్బిల్డింగ్పైనుంచి దూకి సూసైడ్చేసుకున్నాడు. చిలకలగూడ సీఐ అనుదీప్, ఎస్సై రాకేశ్తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లికి చెందిన పప్పుల నరేందర్(37) వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇంటిపై బ్యాంకులో రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బులను సొంతంగా షాప్పెట్టేందుకు, ఇతర అవసరాలకు ఖర్చు చేశాడు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ఆఫీసర్లు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఈ నెల 1న నరేందర్పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.
బాధితుడిని డాక్టర్లు మూడో ఫ్లోర్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అప్పు తీర్చే మార్గం లేదని, తాను చస్తానని తరచూ భార్య, సోదరుడితో చెబుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున సోదరుడి సాయంతో బాత్రూమ్ వెళ్లాడు. లోపల గడియపెట్టుకొని కిటికీలో నుంచి దూకాడు. ఈ ఘటనలో నరేందర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లావణ్య, నాలుగేండ్ల పాప, రెండేండ్ల బాబు ఉన్నారు.
