డయల్ 100ను మిస్ యూజ్ చేసిన వ్యక్తికి 4రోజుల జైలు

డయల్ 100ను మిస్ యూజ్ చేసిన వ్యక్తికి 4రోజుల జైలు

బాల్కొండ, వెలుగు: ఆపత్కాలంలో సాయం చేసే డయల్ 100ను మిస్ యూజ్ చేసిన వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సుహాసిని గురువారం తెలిపారు. మెండోరాకు చెందిన సందేశ్ బాబు మద్యం మత్తులో 100 నంబర్ కు కాల్ చేసి పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 4రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.