వీడు రాక్షసుడే.. భార్యపై అనుమానంతో ఫ్రెండ్ గొంతు కోసి.. ర‌క్తం తాగిన భర్త

వీడు రాక్షసుడే.. భార్యపై అనుమానంతో ఫ్రెండ్ గొంతు కోసి.. ర‌క్తం తాగిన భర్త

కర్ణాటకలో వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునన్నాడనే అనుమానంతో తన స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు. ఈ ఘటనలో నిందితున్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ స్నేహితుడు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన స్నేహితుడు మారేష్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని విజయ్ అనుమానించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తనను కలవాలని మారేష్‌ని కోరాడు. అనంతరం వారి మధ్య వాదన తీవ్రరూపం దాల్చడంతో ఆవేశానికి గురైన విజయ్.. పదునైన ఆయుధంతో మహేష్ గొంతు కోశాడు.  మొబైల్ ఫోన్ లో తీసిన ఈ వీడియోలో, విజయ్ తన స్నేహితుడిని పట్టుకుని రక్తం తాగుతున్నట్లు కనిపించాడు.

దాని కంటే ముందు పడుకున్న మారేష్‌ని ప్రశ్నించడం, విజయ్ అతని రక్తం తాగడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. అతను వంగి మారేష్ గొంతు నుండి కారుతున్న రక్తాన్ని తాగుతున్నట్లు కనిపించే ఈ దారుణమైన ఘటన ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. అతను గాయపడిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టడం కూడా దీంట్లో కనిపిస్తుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్‌పై కెంచర్లహళ్లి పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు కాగా, మారేష్ చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.