గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41A CRP కింద రాజాసింగ్ కు నోటీసులు పంపారు. గతేడాది ఆగస్టులో అజ్మీర్ దర్గాపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కంచన్ బాగ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు మంగళహాట్ పోలీస్స్టేషన్కు బదిలీ అయ్యింది. దీంతో ఈ కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు రాజాసింగ్కు తాజాగా నోటీసులు పంపారు. 

అంతకుముందు.. మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు  పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌  చేశారు. హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో రాజాసింగ్  జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు రెండు నెలలు రాజాసింగ్ జైల్లోనే ఉన్నారు.