కోడిని నమ్ముకుని కోటీశ్వరుడయ్యాడు.. దాని వెనుక ఎంత కష్టం ఉందో తెలుసా !

కోడిని నమ్ముకుని కోటీశ్వరుడయ్యాడు.. దాని వెనుక ఎంత కష్టం ఉందో తెలుసా !

కోడిని నమ్ముకుని కోటీశ్వరుడైన స్టోరీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన కోడి పందేల్లో ఒక వ్యక్తి ఏకంగా కోటీ న్నరకు పైగా గెలిచి భలిరా అనిపించాడు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన పోటీల్లో  రాజమండ్రివాసి రమేశ్ అనే వ్యక్తి రూ. కోటీ 53 లక్షలు గెలిచి రికార్డు సృష్టించాడు.

రెండో రోజు నిర్వహించిన ఈపోటీల్లో రూ.కోట్లలో నగదు చేతులు మారింది. అయితే ఈ పోటీల్లో పైబోయిన వెంక టరామయ్య బరిలో కోడి పందేలు సాగాయి. గుడివాడ ప్రభాకర్, రాజమండ్రివాసి రమేశ్ డేగ కోళ్ల మధ్య భారీ పందెం జరిగింది. హోరా హోరీగా సాగిన పోటీలో చివరకు రమేశోగ విజయం సాధించి.. ఏకంగా రూ.1 కోటి 53 లక్షలు గెలుచుకున్నాడు. దీనిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా పందెం ప్రేమికులు భారీగా వచ్చారు. దీంతో బరులు కిటకిటలాడాయి. కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద భారీ పందెం అని స్థానికులు చె బుతున్నారు.

గెలుపు వెనక ఎంత కష్టమో..

కోటిన్నర గెలిచిన రమేష్ ను స్నేహితులు ఆకాశానికి ఎత్తుకుని ఊరేగించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు శభాష్ అంటున్నారు. అందరి దృష్టిలో రమేష్ ఈజీగా కోటిన్నర సంపాదించాడు అనే అభిప్రాయం ఉంది. కానీ దాని వెనుక చాలా కష్టం ఉందని స్నేహితులు చెబుతుంటే తెలుస్తోంది. యజమాని రమేష్ తన డేగ పుంజును ఆరు నెలలుగా పందేనికి సిద్ధం చేస్తూ వస్తున్నాడు. కోడికి బాదం, పిస్తా లాంటి ఆహారాన్ని పెట్టి బలీయంగా తయారు చేశాడు. కోడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేయిస్తూ వస్తున్నాడు. 

బరిలో సేతువ కోడితో తలపడిన ఈ పుంజు.. మొదటి నుంచే దూకుడు ప్రదర్శించి తనకన్నా బరువైన, పెద్దదైన పుంజుపై విజయం సాధించింది. కాళ్లలో ఉన్న బలం.. కాళ్లకు కట్టిన కత్తితో ప్రత్యర్థి కోడిపై విరుచుకుపడి నిమిషాల వ్యవధిలోనే ఆటను ముగించేసింది. యజమాని రమేష్ నమ్మకాన్ని నిలబెట్టి కోటీశ్వరుడిని చేసింది. తన ఆరు నెలల కష్టం, కలలు ఫలించాయని భావోద్వేగానికి గురయ్యాడు రమేష్.