మాటిస్తున్నా..ప్రశాంతమైన మణిపూర్ను తిరిగిచ్చేస్తాం: రాహుల్ గాంధీ

మాటిస్తున్నా..ప్రశాంతమైన మణిపూర్ను తిరిగిచ్చేస్తాం: రాహుల్ గాంధీ

 దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో న్యాయ్ యాత్రను ప్రారంభించారు రాహుల్. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ..గత కొన్ని రోజులుగా మణిపూర్ రగులుతోందని.. ప్రధాని మోదీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భారత్ న్యాయ్ యాత్రను ముంబై  నుంచి ప్రారంభించాలని చాలా మంది చెప్పారు కానీ.. తాను మణిపూర్ నే ఎంచుకున్నానని తెలిపారు. ఎంతో మంది అన్నాదమ్ముళ్లు మణిపూర్ లో చనిపోయారన్నారు.   తాము మణిపూర్ ప్రజల భాదను అర్థం చేసుకున్నామని చెప్పారు. మళ్లీ ప్రశాంతత మణిపూర్ ను తిరిగిచ్చేస్తానని రాహుల్ అక్కడి ప్రజలకు మాటిచ్చారు రాహుల్..హింస, అన్యాయం లేని దేశం కావాలన్నారు రాహుల్.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ సెక్టారును పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. దేశ సంపద ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్లిందన్నారు.  ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బతకడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది న్యాయ్ యాత్ర ఎందుకని అడిగారు.. అన్యాయ కాలంలో ఉన్నాము కాబట్టే న్యాయ్ యాత్ర చేపడుతున్నామని చెప్పారు. యాత్రలో చిరు వ్యాపారులు,మహిళల కష్టాలను అడిగి తెలుసుకుంటానన్నారు.

 ఒకే జాతి ఒకే భూమి పేరుతో  భారత్ జోడోయాత్ర చేశా.. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు.  ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. 

రాహుల్ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర  15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6 వేల 713 కిలోమీటర్లు రాహుల్  పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను..  మార్చి 20 లేదా 21న ముంబైలో ముగించనున్నారు రాహుల్.