
- మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పునర్నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ ను రాబోయే మిర్చి సీజన్ వరకు కంప్లీట్ చేసి అందుబాటులోకి తేవాలని ఇంజినీరింగ్ అధికారులను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి ఆదేశించారు. గురువారం డైరెక్టర్ మార్కెట్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు.
నిర్మాణ పనులపై మార్కెట్ శాఖ అధికారులు, పాలకవర్గం, ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్షించారు. ఈ సమీక్షలో అడిషనల్ డైరెక్టర్ రవికుమార్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ (వరంగల్) వి.శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజినీర్ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ హన్మంతరావు, గ్రేడ్ వన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.