
జగిత్యాల రూరల్: భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసిన ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇటీవల రాజశేఖర్, హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపుతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈక్రమంలో భార్యను వదిలిపెట్టి దీపుతో సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలిసిన భార్య.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతోంది.
ఆమె హాస్పిటల్ లో ఉన్నప్పటికీ రాజశేఖర్ రాలేదు. ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న అతడిని అత్తామామలు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పిలిపించి విచారణ చేపట్టారు.