
లార్ట్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల టీమ్ ప్లేయర్ దీప్తి శర్మ.. చార్లీ డీన్‌ను మన్కడింగ్ పద్ధతిలో రనౌట్ చేయడం వివాదాస్పదమైంది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు మండిపడ్డారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు దీప్తి శర్మ సమాధానం ఇచ్చింది. రనౌట్ కావడానికి ముందే చార్లీ డీన్‌కు తాను హెచ్చరించానని చెప్పుకొచ్చింది. అంపైర్లకు కూడా సమాచారం ఇచ్చానని స్పష్టం చేసింది.
బాల్ వేయకముందే ఎలా వెళ్తుంది..?
చార్లీ డీన్ ప్రతీ సారి క్రీజు నుంచి బయటకు వస్తుంది. బాల్ వేయకముందే క్రీజు నుంచి ఎలా ముందుకు వెళ్తావని నేను హెచ్చరించినా. దీనిపై ముందే అంపైర్లకు తెలియజేశా. అయినా వినకుండా బంతి వేయకముందే క్రీజును క్రాస్ చేసింది. దీంతో రనౌట్ చేశా. మేము నిబంధనలనే పాటించే ఔట్ చేశాం... అని దీప్తి పేర్కొంది.
ఎంసీసీ కీలక ప్రకటన..
రనౌట్ వివాదంపై క్రికెట్ చట్టాల సంరక్షకులైన మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ కీలక ప్రకటన చేసింది. రనౌట్‌లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. దీన్ని తప్పు చర్యగా చూడకూడదని చెప్పింది. చాలా మంది క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘనగా చూస్తున్నారని..అది సరైనది కాదని పేర్కొంది. నాన్స్ట్రైకర్ బౌలర్ బంతి వేయడానికి ముందే క్రీజును వీడితే అతనికి అదనపు ప్రయోజనం దక్కినట్లేనని తెలిపింది. నాన్ స్ట్రైకర్లు బౌలర్‌ను గమనించి..బ్యాట్స్మన్ రనప్ మొదలెడితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు... అని ఎంసీసీ చెప్పింది.
మరి ఇదేంటి...?
దీప్తి శర్మ మన్కడింగ్ విషయంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు మండిపడటంపై టీమిండియా మాజీ ఓపెనర్, ఆకాష్ చోప్రా తనదైన శైలిలో స్పందించాడు . గతంలో ఇంగ్లాండ్ కీపర్ అమీ జోన్స్.. ఓ క్యాచ్ విషయంలో ప్రవర్తించిన తీరును ఎండగట్టాడు. క్రీడాస్ఫూర్తి గురించి ఇంగ్లాండ్ ప్లేయర్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశాడు. 2020 జనవరిలో ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు సంబంధించిన పాత వీడియోను ఆకాష్ చోప్రా షేర్ చేశాడు.
ఆ మ్యాచ్ లో స్మృతి మంధాన కీపర్ క్యాచ్ అవుట్ అయి వెళ్లిపోయే టైంలో అంపైర్లు అది నాటౌట్ అని తేల్చారు. వికెట్ కీపర్ అయిన అమీ జోన్స్ క్యాచ్ అందుకునే సమయంలో బాల్ గ్రౌండ్ పై పడినట్లు క్లియర్ గా కనిపించింది. అయితే ఆమె మాత్రం క్యాచ్ అందుకున్నట్లు సెలబ్రేట్ చేసుకుంది. ఇదంతా కెమెరాలో రికార్డు కావడంతో..జోన్స్ బండారం బయటపడింది. మ్యాచ్ తర్వాత తాను చేసిన పనికి అమీ జోన్స్ క్షమాపణలు కూడా చెప్పింది. దీన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆకాశ్ చోప్రా వీడియో షేర్ చేశాడు. డీన్ రనౌట్ విషయంలో దీప్తిని ఆడిపోసుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు, అభిమానులు.. అప్పట్లో అమీ జోన్స్ బండారాన్ని ఎలా మర్చిపోయారు అంటూ ఆకాష్ చోప్రా మండిపడ్డాడు.