విద్యార్థులు ఇష్టపడి చదవాలి : సుహాసిని రెడ్డి

విద్యార్థులు ఇష్టపడి చదవాలి  : సుహాసిని రెడ్డి
  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​ పర్సన్​ సుహాసినిరెడ్డి

మెదక్​ టౌన్, వెలుగు: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​చిలుముల సుహాసినిరెడ్డి అన్నారు. మౌలానా అబుల్ కలాం జయంతి సందర్భంగా మంగళవారం మెదక్​ మైనారిటీ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజీలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా అబుల్​ కలామ్​ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ..  2026-–- 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తూ అడ్మిషన్ కమిటీని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇందులో మైనార్టీ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సురేఖ, మాజీ కౌన్సిలర్ శంసున్నీసా బేగం, ఉమర్ ఖాన్, -మిల్లి అసోసియేషన్ బాధ్యులు, మత పెద్దలు, కాలేజీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కలెక్టరేట్​లో..

మెదక్​కలెక్టరేట్ లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అబుల్​కలామ్​జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ నగేశ్​పాల్గొన్నారు. అబుల్ కలామ్​ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆజాద్‌ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని గుర్తు చేశారు.