యశోద ఆస్పత్రిలో సీఎంకు ముగిసిన టెస్టులు..

యశోద ఆస్పత్రిలో సీఎంకు ముగిసిన టెస్టులు..

హైదరాబాద్ లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో ఇవాళ(బుధవారం) సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిశాయి. కేసీఆర్ ను 40 నిమిషాల పాటు పరీక్షించిన డాక్టర్ల టీం..సీఆర్పీ, సీబీపీ, సిటీ స్కాన్, చెస్ట్ ఎక్స్ రే, ఐఎల్-6, లివర్ ఫంక్షన్ టెస్టులను నిర్వహించారు. చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన తిరిగి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది

ఈ నెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో సీటీ స్కాన్‌, ఇతర పరీక్షల కోసం ఆయన యశోద ఆస్పత్రికి వచ్చారు. అంతకుముందు ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే వైరస్‌ తీవ్రతను తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని డాక్టర్ల సూచనతో యశోద ఆస్పత్రికి వచ్చారు. 

సీఎం కేసీఆర్ కు సాధారణ పరీక్షలతో పాటు CT స్కానింగ్ చేశామని..అంతా సాధారణంగా ఉందన్నారు సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని..త్వరలోనే  విధులకు హాజరయ్యే అవకాశముందన్నారు.

ఈ నెల 19న యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా సీఎంకు స్వల్పంగా  కరోనా  లక్షణాలున్నట్లు తేలింది. RTPCR టెస్ట్ కూడా నిర్వహించగా.. అందులోనూ పాజిటివ్‌గా తేలింది. అప్పటినుంచి డాక్టర్ల సలహాతో ఆయన ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోనే హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు.