యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (యూఐఐసీ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 20.
పోస్టులు: 153.
ఎలిజిబిలిటీ
ఏఐసీటీఈ/ డీఓటీఈ/ యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. 2021, జులై నుంచి 2025 వరకు ఏదైనా సంవత్సరంలో పరీక్షకు హాజరై, ఉత్తీర్ణులై డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 2021, జులై 01కంటే ముందు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌లో 100 శాతం పూర్తి ప్రొఫైల్ ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి ( 2025, డిసెంబర్ 01 నాటికి): 21 నుంచి 28 ఏండ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 1997, డిసెంబర్ 01 కంటే ముందు 2004, డిసెంబర్ 01 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 18
లాస్ట్ డేట్: జనవరి 20
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు uiic.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
