251 మందిని తీసేసిన మీషో

251 మందిని తీసేసిన మీషో

న్యూఢిల్లీ: ఈ–కామర్స్  ప్లాట్‌‌‌‌ఫామ్‌‌ మీషో 251 మంది ఉద్యోగులను  తీసేసింది. కంపెనీకి చెందిన  మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా 15 శాతానికి సమానం. లాభాల్లోకి వచ్చేందుకు ఖర్చులు తగ్గించుకుంటున్నామని, ఇందులో భాగంగా ఉద్యోగులను తొలగించామని కంపెనీ సీఈఓ విదిత్‌‌ ఆత్రేయ ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్‌‌లో పేర్కొన్నారు.  

జాబ్స్ కోల్పోయిన ఉద్యోగులు ఒక నెల జీతాన్ని సెవరెన్స్ పేగా అందుకుంటారు. ఈసాప్స్‌‌ కూడా పొందుతారు.  2020 తో పోలిస్తే 2022 నాటికి కంపెనీ 10 రెట్లు పెరిగిందని  ఆత్రేయ వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, లక్ష్యాలను చేరుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. క్యాష్ రిజర్వ్‌‌లు ఉన్నాయని, అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నామని వివరించారు.