కేసీఆర్తో ఫాంహౌస్లో కొత్త ఎమ్మెల్యేల భేటీ

కేసీఆర్తో ఫాంహౌస్లో కొత్త ఎమ్మెల్యేల భేటీ

బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త గెలిచిన ఎమ్మెల్యేలతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణల భవన్ లో భేటీ అయ్యారు. గెలుపోటములపై సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం.. చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఎమ్మెల్యేలతో మంతనాలు చేశారు. అనంతరం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లారు. అక్కడ కేసీఆర్ తో భేటీ అయ్యారు. పార్టీ గెలుపోటములు.. నియోజకవర్గాల్లో పరిస్థితిని కేసీఆర్ కు వివరించారు ఎమ్మెల్యేలు. 

పార్టీ ఓటమి తర్వాత.. కేసీఆర్ తన రాజీనామాను కూడా స్వయంగా అందజేయకుండా.. సెక్యూరిటీ లేకుండా.. సొంత కారులో.. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి నేరుగా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ వెళ్లిపోయారు. కనీసంలో మీడియాకు ముఖం కూడా చూపించలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కొత్త ఎమ్మెల్యేలు ఫాంహౌస్ వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు.