శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవ లీలాకళ్యాణం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గిరిజనులు..

శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవ  లీలాకళ్యాణం.. అమ్మవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన గిరిజనులు..

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.   భ్రమరాంబ సమేత  మల్లికార్జునస్వామి నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తులను  అక్కమహాదేవి అలంకార మండపంలో..  నందివాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేకంగా హారతులిచ్చారు .

స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు కన్నులపండువగా గ్రామోత్సవంలో విహరించారు.ఈ కార్యక్రమంలో  కళాకారుల  నృత్యాలు భక్తలను అలరించాయి.... అనంతరం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భాగంగా పార్వతిదేవి .. మల్లికార్జునస్వామికి దేవస్థానం అధికారులు  బ్రహ్మోత్సవ  లీలాకళ్యాణం ఘనంగా జరిగింది.  ఈ కల్యాణానికి  చెంచు గిరిజనులను .. దేవస్థానం చైర్మన్,ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,ఈవో ప్రత్యేకంగా ఆహ్వానించారు.

 పరమేశ్వరుని రూపంలో నున్న మల్లికార్జున స్వామి .. పార్వతీదేవి రూపంలో ఉన్న భ్రమరాంబ అమ్మవారి కల్యాణానికి వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులు వెదురు బియ్యం,ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవీతం..  శ్రీస్వామి అమ్మవారి బ్రహ్మోత్సవ కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు చెంచు గిరిజనులు.  పార్వతిదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు . ఈ కల్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరుపున వస్త్రాలు అందజేయగా ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అసిస్టెంట్ అధికారి సురేష్ కుమార్,ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,ఈవో,అధికారులు,సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు