‘ఛాంపియన్’ సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందాన్ని ఇచ్చిందని, ఇది చాలా యూనిక్ కథ అని మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ అన్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని రూపొందించాడు.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ ‘నిజాం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. ఆ కాలంలోని గ్రామాలు, ప్రజల ఎమోషన్స్‌ని చాలా విభిన్నంగా ఇందులో చూపిస్తున్నారు.
తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్‌ని మిళితం చేసి ఒక జానర్ క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది. ఇప్పటికే విడుదలైన గిర గిర సాంగ్, సల్లంగుండాలి పాటలకు మంచి ఆదరణ దక్కడం ఆనందం అనిపించింది. గిరి గిర హీరో ఇంట్రో సాంగ్. మంచి మెలోడీ.
మంచి బీట్ కూడా యాడ్ అవ్వడంతో కొత్త ఫ్లేవర్ వచ్చింది. సల్లంగుండాలి నా జానర్ సాంగ్. ఇది చాలా హాంటింగ్ మెలోడీ. ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇంకో రెండు రిలీజ్ కాబోతున్నాయి. ఇలాంటి సాంగ్స్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది’ అని చెప్పాడు.
