గిరి సౌర జల వికాసంపై రైతులకు అవగాహన కల్పించండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గిరి సౌర జల వికాసంపై  రైతులకు అవగాహన కల్పించండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సక్సెస్ చేయాలని అధికారులను ఎస్టీ, ఎస్సీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. గిరిజన రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు అందించాలని తెలిపారు. గురువారం ఆయన సెక్రటేరియెట్ లో ట్రైబల్ శాఖపై తొలిసారి రివ్యూ చేపట్టారు.  పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు.

 దీనిపై ట్రైబల్ జిల్లాల్లోని రైతులకు అవగాహన కల్పించి, అందరూ అప్లై చేసుకునేలా  ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా.. ఎస్టీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు, సీట్ల భర్తీ, హాస్టల్స్ లో సౌకర్యాల గురుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో హాస్టల్స్ లో తనిఖీ చేస్తానని మంత్రి తెలిపారు. గురుకులాల్లో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

అద్దె బకాయిలు ఇటీవల విడుదల చేశామని, డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, కొత్త ఛార్జీలు అమలు కావాలని చెప్పారు. వీటితో పాటు ట్రైకార్, గిరిజన కార్పోరేషన్ పనితీరుపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పోరేషన్ చైర్మన్ తిరుపతి,  ట్రైబల్ సెక్రటరీ శరత్, ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి, అడిషనల్ డైరెక్డర్ సర్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ సముజ్వల తదితరులు పాల్గొన్నారు.