
బీఆర్ఎస్ నాయకుల పై విమర్శలు గుప్పించారు మంత్రి దామోదర రాజనర్సింహా. బీఆర్ఎస్ నాయకులు ఆరు లక్ష కోట్లు అప్పు చేసి పోయారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో కూడా ఇల్లు కానీ జాగా కానీ ఇవ్వలేదని అన్నారు. మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రస్తుంపేట్ గ్రామం ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమానికి 28 నుంచి 6 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. ప్రతి గ్రామానికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళామని మంత్రి అన్నారు. వ్యవస్థ అనేది శాశ్వతం.. వ్యవస్థను ఎంత ప్రతిష్ట పరిస్తే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల తర్వాత మార్పు ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. విద్యా, వైద్యం అనేది ప్రభుత్వం ఇచ్చే బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందని.. ఆరు గ్యారెంటీలు ఆచరణలోకి తీసుకోస్తామని మంత్రి దామోదర చెప్పారు.