పేదలకు అందుబాటులోకి విద్య, వైద్యం : హరీష్ రావు

పేదలకు అందుబాటులోకి విద్య, వైద్యం : హరీష్ రావు

ప్రగతి నివేదికలు పని తీరు మెరుగుపర్చుకోవడానికి పనిచేస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు. 2022 అన్యువల్ హెల్త్ రిపోర్టును ఆయన లాంచ్ చేశారు. టీం వర్క్తో ఆరోగ్యశాఖలో మంచి పురోగతి సాధించామన్న మంత్రి.. కొన్ని పొరపాట్లను సరిచేసుకున్నట్లు చెప్పారు.  విద్య, వైద్యం పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇబ్రహీంపట్నం ఘటన లాంటివి తిరిగి జరగకుండా ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీంను తీసుకొచ్చామన్నారు. పనితీరులో రాష్ట్ర వైద్య శాఖ మూడో స్థానంలో నిలిస్తే.. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ చివరి స్థానంలో నిలిచిందని విమర్శించారు. ఒకే ఏడాది 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ ఒకటి, హైదరాబాద్లో నాలుగు  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు  నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. 

2022లో 4 కోట్ల 83 లక్షల ఓపీ సేవలు, 16 లక్షల 97వేల ఇన్ పేషెంట్ సేవలు అందించామని హరీష్ రావు చెప్పారు. సీ సెక్షన్ రేట్ తగ్గించడానికి ఇన్సెంటివేషన్ ప్రోగ్రాం అమలుచేశామన్నారు. డయాలసిస్ కేంద్రాలు102కి పెంచామన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషియన్ కిట్ పథకం సూపర్ హిట్ అయ్యాయన్నారు. రాష్ట్ర పాలసీలను ఇతర రాష్టాలు మెచ్చుకున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. బస్తీ దవాఖానలతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకు ఓపీ సంఖ్య తగ్గిందన్నారు. ప్రికాషనరీ డోస్ జాతీయ సగుటు కంటే ఎక్కువ ఇచ్చామన్నారు. 2022 లో 11 వేల కొత్త బెడ్స్ ఏర్పాటు చేశామన్నా ఆయన.. 27 వేల  పడకలకు ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.