జులై 22లోగా రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

జులై 22లోగా రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి, వెలుగు:  కొత్తగా మంజూరైన రేషన్​కార్డులను ఈ నెల 22లోగా లబ్ధిదారులకు అందించాలని ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌లో  రేషన్​కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొత్తగా 12 వేల మందికి రేషన్​ కార్డులు మంజూరు చేశామని ఆఫీసర్లు తెలిపారు. 9,374 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా 6,836 ఇండ్లు మార్క్ అవుట్ చేశామని తెలిపారు. పాత, కొత్త కార్డుల్లో కలిపి మొత్తంగా 1,02,484 మందిని మెంబర్లుగా చేర్చామని చెప్పారు.

 అనంతరం మంత్రి మాట్లాడారు. లబ్దిదారులకు సాధ్యమైనంత త్వరగా కార్డులు అందించాలన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం పేదలకు సంఘాలు, బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.