స్వాతంత్ర్యం కోసం పోరాడినట్టే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

స్వాతంత్ర్యం కోసం పోరాడినట్టే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • మంత్రి పొన్నం ప్రభాకర్​ పిలుపు

మెహిదీపట్నం, వెలుగు: దేశ స్వాతంత్రం కోసం పోరాడినట్లే 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయాల పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్  పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ కమిషన్  ఆధ్వర్యంలో శనివారం లంగర్  హౌస్  బాపు ఘాట్  సమాధి వద్ద 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు భజనలు, ప్రార్థనల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ గాంధీ అడుగుజాడల్లోనే శాంతియుతంగా 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు కృషి చేయాలన్నారు.

 ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా సమస్యలను పరిష్కరించూసుకోవాలన్నారు. తెలంగాణ సాధన కోసం ఏవిధంగా ఐక్యంగా పోరాడమో అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల సాధనకు కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్  చైర్మన్  నిరంజన్, బీసీ కమిషన్ మెంబర్​ బాలలక్షి, కాంగ్రెస్​ నేతలు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.