పీఏసీఎస్ అభివృద్ధికి సహకరిస్తాం : మహిళా డైరెక్టర్ శైలజ

పీఏసీఎస్  అభివృద్ధికి సహకరిస్తాం : మహిళా డైరెక్టర్  శైలజ

కల్వకుర్తి, వెలుగు :  దేశంలోని వ్యవసాయ పరపతి సంఘాల అభివృద్ధికి మరింత  సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సహకార పరపతి సంఘాల మహిళా డైరెక్టర్  శైలజ తెలిపారు. బుధవారం కల్వకుర్తి పీఏసీఎస్​ను సందర్శించి, అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చించారు. సహకార భారతి నాగర్ కర్నూల్  డైరెక్టర్  పాండురంగా రెడ్డి, కల్వకుర్తి పీఏసీఎస్  చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి, సీఈవో వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.