పెబ్బేరు, వెలుగు: నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న మెడికో కేఎన్ నిఖిత మండలంలోని ఏటిగడ్డ శాఖాపూర్ సర్పంచ్గా ఎన్నికైంది. గ్రామంలో 2,328 ఓట్లు పోల్ అవగా, 1,022 ఓట్లు నిఖితకు వచ్చాయి. సమీప అభ్యర్థి లచ్చమ్మపై 548 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
