పద్మశ్రీ వనజీవి రామయ్య పార్క్ ప్రారంభం

పద్మశ్రీ వనజీవి రామయ్య పార్క్ ప్రారంభం

ఖమ్మం: అత్యంత దుర్భరంగా ఉన్న గోళ్లపాడు ఛానల్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పట్టణంలోని 30వ డివిజన్ లో పద్మశ్రీ వనజీవి రామయ్య పేరుతో ఏర్పాటు చేసిన పార్క్ ను.. పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో కలిసి మంత్రి ప్రారంభించారు. చెట్లు, అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం విశేష  కృషి చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులను మంత్రి పువ్వాడ, సీనియర్ ఐఏఎస్ అధికారిణి  ప్రియాంక వర్గీస్ తదితరులు సత్కరించారు.

ప్రజల ఆరోగ్యంతోపాటు ఆహ్లాదం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని  మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. గోళ్లపాడు ఛానల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయించారని చెప్పారు. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడంతోపాటు.. మరో ఐదారు పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పువ్వాడ అజయ్ వివరించారు.