కిన్నెరసాని గురుకులం స్వర్ణోత్సవాలు

కిన్నెరసాని గురుకులం స్వర్ణోత్సవాలు
  •     దేశవ్యాప్తంగా తరలిరానున్న పూర్వ విద్యార్థులు 

పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కిన్నె రసాని గిరిజన గురుకుల పాఠ శాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వ ర్ణోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమ వారం కిన్నెరసాని లోని గిరిజన గురుకుల పాఠశాల ప్రాంగణంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యా ర్థులు సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భం గా  పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్ శ్యామ్ కుమార్, జీ.రమేశ్, పూర్వ ఉపాధ్యాయులు ఎన్ చక్రవర్తి, ఎస్.కె ఖాదర్, రమేశ్​రెడ్డి, డి వెంకన్న, పీక్ల తదితరులు పాల్గొన్నారు. వచ్చేఏడాది జనవరి 4న ఈ స్వర్ణోత్సవాలను నిర్వహించా లని నిర్ణయించారు. ఇక్కడి గిరిజన ఆశ్రమ పాఠశాల కళాశాలలో చదువుకున్న 3వేల మంది విద్యార్థులను ఈ వేడుకల్లో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. 

ఈ కళాశాలలో చదువుకొని ఉన్నత స్థానాల్లో దేశ, విదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన ప్రముఖులను, డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు , శాస్త్ర వేత్తలు, పత్రికారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్య కర్తలుగా స్థిరపడిన వారు రైతులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ మేరకు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయాలని, త్వరలోనే ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రమేశ్​ రాథోడ్, పడిగా సత్యనారాయణ, రవి రాథోడ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.