వేములవాడలోని శ్రీరామ నవమి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

వేములవాడలోని  శ్రీరామ నవమి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీతారామ కల్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్, ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సోమవారం భీమేశ్వర స్వామి మండపంలో ఈవో రమాదేవి  ప్రత్యేక పూజలు చేసి భక్తుల సమక్షంలో విడుదల చేశారు. 

ఈ నెల 27న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనున్నట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు శ్రీనివాస్ శర్మ, వంశీ, గడ్డం రాజేందర్, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.