- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి
మంచిర్యాల/కాగజ్నగర్/జైపూర్, వెలుగు: తెలంగాణ మంత్రి సీతక్క మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ప్రక్రియలో పాల్గొనడంతోపాటు వారి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నాలుగు రోజులపాటు అక్కడే ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శుక్రవారం ఆయన పర్యటించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఈఆర్ వోలు, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులతో ఓటరు జాబితాపై రివ్యూ నిర్వహించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను ఓటరు జాబితాలో నమోదు చేయాలని, స్పష్టమైన జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల తొలగింపుకు గల కారణాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 235 పోలింగ్ కేంద్రం, జైపూర్ మండలం ఇందారంలో ఏర్పాటు చేసిన 109, 110 పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిసరాలు, ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటరు జాబితా వివరాలను పరిశీలించారు. ఓటర్లు తమ వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఓటర్లకు ఇబ్బందులు రాకుండా చూడాలి
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కుమ్రం భీం జిల్లాలో పర్యటించిన ఆయన.. కాగజ్ నగర్ పట్టణంతో పాటు కోసిని గ్రామంలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, డీఎస్పీ రామానుజంతో కలిసి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, ఓటరు నమోదు ప్రక్రియపై బీఎల్ వోలను అడిగి తెలుసుకున్నారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండుతున్న వారిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.