త్వరలో అర్హులైన పేదలకు ఇండ్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

త్వరలో అర్హులైన పేదలకు ఇండ్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • క్రీస్తు చూపిన ప్రేమ, మానవత్వం ఆదర్శం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: ప్రపంచానికి క్రీస్తు చూపిన ప్రేమ మానవత్వం అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం క్రిస్మస్ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీనగర్, తిలక్ నగర్, మేళ్లచెరువు రోడ్, గోవిందపురం, సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న, మిర్యాలగూడ రోడ్డు, దద్దనాల చెరువు కాలనీల్లో గల చర్చిలలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

అనంతరం శ్రీలక్ష్మి నరసింహ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన ప్రార్థనలో మంత్రి ఉత్తమ్  పాల్గొని  కేకే కట్ చేసి అందరికీ క్రిస్టియన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా దైవ సన్నిధిలో క్రిస్టియన్లను కలవడం సంతోషంగా ఉందన్నారు. శివారులో  రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతాయన్నారు.

 అధికారులు ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి అర్హుల జాబితా తయారు చేస్తారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే కేటాయిస్తారన్నారు.  సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన అందరికీ మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇండ్ల కోసం పేదలు దళారులను నమ్మవద్దని అర్హత కలిగిన వారందరికీ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఫాదర్స్, మత పెద్దలు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.