న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్..సద్వినియోగం చేసుకోవాలని కోరిన మంత్రి వెంకట్ రెడ్డి

న్యాక్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్..సద్వినియోగం చేసుకోవాలని కోరిన మంత్రి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నామని ఆర్అండ్​బీ మినిస్టర్, న్యాక్​వైస్ చైర్మన్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సివిల్ సూపర్ వైజర్, ఎలక్ట్రిషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. శిక్షణతో పాటు ఉచిత భోజనం, నివాసం, వసతి సదుపాయాలు కల్పించనున్నామని పేర్కొన్నారు.

 శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ తో పాటు ఉద్యోగావకాశాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ శిక్షణ కార్యక్రమం నవంబర్ 3 నుంచి హైదరాబాద్ లోని న్యాక్​లో  ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు. శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8008937800, 9032504507 సెల్​ నెంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.