గరికపాటి ప్రవచనాలతో మనసుకు సంతృప్తి : మంత్రి వివేక్ వెంకటస్వామి

గరికపాటి ప్రవచనాలతో మనసుకు సంతృప్తి : మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్ , వెలుగు: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నర్సింహా రావు ప్రవచనాలు ప్రజలను చైతన్యపరుస్తాయని, మనసుకు చాలా సంతృప్తిని కలిగిస్తాయని మంత్రి వివేక్​వెంకటస్వామి అన్నారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగంలో గురువారం శ్రీ వాసవి ఆర్ట్స్, ఆర్య వైశ్య ఆఫీసర్స్, ప్రొఫెషనల్స్​అసోసియేషన్​ఆధ్వర్యంలో సంగీత సాహిత్యాలతో సాంత్వన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. తర్వాత పద్మశ్రీ గరికపాటి నర్సింహా రావు ప్రవచనాలిచ్చారు. ఈ ప్రోగ్రామ్​లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. గరికపాటి ప్రవచనాలు, ఆయన చెప్పే  నీతి వ్యాఖ్యలు దేశంలో ఎంతో మందిని ప్రభావితం చేశాయన్నారు. ఈ సందర్భంగా మంత్రిని నిర్వాహకులు సత్కరించారు.