
- మంత్రిని కలిసిన ఎమ్మెల్యే, ఎంపీ
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: పెరిగిన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డిని కోరారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారితో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ఉన్నారు.