ఎల్ఆర్ఎస్‌‌‌‌తో రూ.25 వేల కోట్ల భారం : కల్వకుంట్ల సంజయ్

ఎల్ఆర్ఎస్‌‌‌‌తో రూ.25 వేల కోట్ల భారం : కల్వకుంట్ల సంజయ్
  • కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి, వెలుగు : ఎల్ఆర్ఎస్ తో  కాంగ్రెస్​ సర్కార్‌‌‌‌‌‌‌‌  రాష్ట్రప్రజలపై రూ.25 వేల కోట్ల భారం వేస్తుందని, దరఖాస్తుదారులు ఫీజు చెల్లించవద్దని, ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేసేంత వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం మెట్ పల్లి క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి

ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ఫ్రీగా రెగ్యులరేజేషన్ చేస్తామన్నారని అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. వర్షాలు లేకనే ప్రాజెక్టుల్లో నీరు లేదని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.  సీఎంకు పాలనపై విజన్, ఐడియా లేదని మైకు పట్టుకొని మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను బూతులు తిట్టడడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

ప్రస్తుతం ఎస్సారెస్పీలో 26 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, తాగునీటికి 15 టీఎంసీలు పోను.. 11 టీఎంసీలు ఉంటాయని, వాటితో రైతుల పంటలను ఎలా కాపాడుతారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అనంతరం కోరుట్ల నిరుద్యోగ యువత కోసం ఈ నెల 12న జాబ్‌‌‌‌మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు.