వర్ధన్నపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధం : ఎమ్మెల్యే కేఆర్నాగరాజు

వర్ధన్నపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధం :  ఎమ్మెల్యే కేఆర్నాగరాజు

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: బీఆర్​ఎస్​ పదేండ్ల పాలన, ఇప్పుడున్న ప్రజాప్రభుత్వ రెండేండ్ల పాలనలో వర్ధన్నపేటకు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు సవాల్​ విసిరారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో హనుమకొండ, హసన్ పర్తి మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 132 మంది లబ్ధిదారులకు రూ.కోటీ 34లక్షల 15వేల 544 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వర్ధన్నపేటను భ్రష్టు పట్టించారని, వ్యక్తిగత విమర్శలు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం తగదని హెచ్చరించారు..

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ఫ్రస్టేషన్‌‌ లో స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేను వర్ధన్నపేట మున్సిపల్​ కొత్త పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. మున్సిపల్ చైర్​పర్సన్​పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్​పర్సన్​ నేతావత్ శిబారాణి రాజేందర్, కౌన్సిలర్లు, ఇతర నాయకులు ఎమ్మెల్యేను కలిసి బొకే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెనికి చెందిన మహమ్మద్ సోని - గుళ్లు దంపతులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో వారి గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్​జిల్లా వర్ధన్నపేట ఇల్లందలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి, నిర్మాణాలను ప్రారంభించారు.