పేదలకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం 

 పేదలకు అండగా కాంగ్రెస్​ ప్రభుత్వం 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పేదలకు అండగా రాష్ర్ట కాంగ్రెస్​ ప్రభుత్వం ఉంటుందని నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో 57 మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు. అనంతరం మండలంలోని గన్యాగుల, పెద్ద ముద్దునూరు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, కోటయ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.