
కొడిమ్యాల, వెలుగు: యువతుల వివాహాలకు ఇచ్చే కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో 56 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 18 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు లేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోగూరి మహిపాల్ రెడ్డి, చిలువేరి నారాయణ, గుగులొత్ వినోద్, తహసిల్దార్ కిరణ్, ఎంపీడీవో స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
గౌడన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం
రామడుగు/బోయినిపల్లి, వెలుగు: రాష్ట్రంలోని గౌడన్నలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. వన మహోత్సవంలో భాగంగా రామడుగు మండలం వెలిచాలలో రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్‌లో శుక్రవారం ఈత మొక్కలు నాటారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన మహిళలు కొందరు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరగా వెంటనే ఎంపీడీవోతో మాట్లాడి అర్హులకు ఇండ్లను ఇవ్వాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జగిత్యాల డీఆర్డీవో శ్రీధర్, బోయినిపల్లి ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్‌యాదవ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్, రామగుడు ఎంపీడీవో రాజేశ్వరి, లీడర్లు వీర్ల నర్సింగరావు, కాడె శంకర్, కూస రవీందర్, రమణారెడ్డి పాల్గొన్నారు.