కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత

బాన్సువాడ, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేద బిడ్డల పెళ్లికి ఇబ్బంది కలగొద్దనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. బాన్సువాడ టౌన్, బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్, బీర్కుర్ మండలాలకు చెందిన 122 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల విలువైన చెక్కులు అందించినట్లు పేర్కొన్నారు.  నస్రుల్లాబాద్ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ దుర్గం శ్యామల, డీఏవో సువర్ణ తదితరులు         పాల్గొన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ..

వర్ని, వెలుగు: రుద్రూర్ కు చెందిన వైస్​ఎంపీపీ నట్కరి సాయిలు తండ్రి రాములు, రాయకూర్​కు చెందిన విండో చైర్మన్ ​పురుచూరి సంగమేశ్వర్​కుమారుడు రవి ఇటీవల మృతిచెందారు. బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి శనివారం పరామర్శించారు. రుద్రూర్​విండో చైర్మన్​ సంజీవ్​రెడ్డి, మాజీ చైర్మన్​పత్తి రాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్, మాజీ జడ్పీటీసీ నరోజి గంగారాం 
తదితరులున్నారు.