
- ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం రూరల్, అర్బన్ మండలాల్లోని తాటిపల్లిలో రూ.27 లక్షలు, తిప్పన్నపేటలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం తిప్పన్నపేటలో పల్లె దవాఖానను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.150 కోట్లు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, జ్యోతి, శ్రీనివాస్, డీఈ వరుణ్, ఏఈలు పాల్గొన్నారు.